విమాన ప్రయాణీకులకు మెరుగైన సేవలు: కువైట్ డీజీసీఏ కీలక ఒప్పందాలు
- November 27, 2022
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలను అందనున్నాయి. ఈ మేరకు కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రెండు విమానయాన సంస్థలతో కీలక ఒప్పందాలను చేసుకున్నది. విమానాశ్రయంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు, కార్యకలాపాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడడానికి ఇటీవల కువైట్ ఎయిర్‌వేస్ మరియు నేషనల్ ఏవియేషన్ సర్వీసెస్ (NAS)తో సేవా స్థాయి ఒప్పందం (SLA) పై సంతకం చేసినట్లు DGCA తాత్కాలిక డైరెక్టర్ జనరల్ సలేహ్ అల్-ఫదాగి వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుతాయన్నారు. ఉత్తమ పనితీరు కనబర్చని వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అల్-షదాగి హెచ్చరించారు. బ్యాగేజీ వేయింగ్ ప్రాంతాలు, ప్రవేశ ద్వారం, బ్యాగేజీ క్లెయిమ్, ప్రయాణీకులను స్వాగతించడం, లగేజీ కన్వేయర్, ఎయిర్‌క్రాఫ్ట్ క్లీనింగ్, ఇంధనం నింపడం వంటి అనేక ఇతర సేవలును గ్రౌండ్ సర్వీస్ కంపెనీలు అందిస్తున్నాయని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







