అట్టహాసంగా ముగిసిన ఇండియన్ స్కూల్ మెగా ఫెయిర్

- November 27, 2022 , by Maagulf
అట్టహాసంగా ముగిసిన ఇండియన్ స్కూల్ మెగా ఫెయిర్

బహ్రెయిన్: ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ మెగా ఫెయిర్ అట్టహాసంగా ముగిసింది. ఇండియన్ స్కూల్ మెగా ఫెయిర్ చివరిరోజు నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నది. రైడ్‌లు, అంతర్జాతీయ వంటకాలు, థ్రిల్లింగ్ షోలతో కూడిన మూడు రోజుల ఈ మెగా కార్నివాల్ శుక్రవారం ప్రారంభమైంది. ఇసా టౌన్ క్యాంపస్‌లో నిర్వహించిన చివరి రోజు కార్యక్రమాలకు ఆహ్వానితులు పోటెత్తారు. బాలీవుడ్ గాయని భూమి త్రివేది, ఆమె బృందం పాడిన జానపద పాటలు ప్రేక్షకులను, మ్యూజిక్ లవర్లను అలరించాయి. ప్రముఖ కళారూపమైన ఒప్పన, రిఫా క్యాంపస్ విద్యార్థులు ప్రదర్శించిన గోవా నృత్యం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ముగింపు కార్యక్రమానికి క్యాపిటల్ గవర్నరేట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫాలో-అప్ యూసుఫ్ యాకూబ్ లోరీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిస్క్ అసైన్‌మెంట్ అండ్ లీగల్ అఫైర్స్ డైరెక్టర్ రీమ్ అల్ సనేయ్, ఐఎస్‌బి ఛైర్మన్ ప్రిన్స్ ఎస్ నటరాజన్, సెక్రటరీ సాజి ఆంటోనీ, వైస్-ఛైర్మెన్ జయఫర్ మైదానీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ప్రేమలత ఎన్‌ఎస్, అడ్వా. బిను మన్నిల్ వరుగీస్, రాజేష్ ఎంఎన్, అజయకృష్ణన్ వి, మహ్మద్ ఖుర్షీద్ ఆలం, మహ్మద్ నయాజ్ ఉల్లా, ప్రిన్సిపల్ విఆర్ పళనిస్వామి, రిఫా క్యాంపస్ ప్రిన్సిపాల్ పమేలా జేవియర్, స్టాఫ్ రిప్రజెంటేటివ్ జాన్సన్ కె దేవస్సీ, మెగా ఫెయిర్ జనరల్ కన్వీనర్ షానవాజ్ పికె, స్టార్ విజన్ కమిటీ చైర్మన్ సేతురాజ్ కడక్కల్, ఫెయిర్ ఆర్గనైజింగ్ కమిటీ అధికారులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com