భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పిటి ఉష
- November 28, 2022
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా లెజెండరీ పిటి ఉష ఎన్నిక లాంఛనంగా నిలిచింది.డిసెంబర్ 10న జరిగే ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ఉష ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.14 మంది టీమ్ సభ్యులు కూడా పలు పదవులకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే అధ్యక్ష పదవికి ఇంకెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో 58ఏళ్ల పరుగు ల రాణి అధ్యక్షురాలిగా దాదాపు ఖరారయ్యారు.
నామినేషన్లు దాఖలు చేయడానికి వారంతో గడువు ముగియగా పదవులకు 24మంది దాఖలు చేశారు. వీరిలో 12మంది కార్యనిర్వాహక మండలి సభ్యులస్థానాలకు పోటీపడుతున్నారు. కాగా ఉష ఆసియా గేమ్స్‌ల్లో బంగారు పతకాలు సాధించారు. 1984 లో జరిగిన 400మీటర్ల ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచారు. కాగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా ఉష రికార్డు సృష్టించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!
- బహ్రెయిన్ లో కేరళ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం..!!
- గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- దుబాయ్ లో Emirates Loves India చే మెగా దీపావళి ఉత్సవ్
- దళారీలను నమ్మి మోసపోవద్దు: టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం