తెలంగాణ సచివాలయం ప్రారంభానికి ముహుర్తం ఖరారు
- November 28, 2022
హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. 2023, జనవరి 18 వ తేదీన కొత్త సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.అప్పటికల్లా పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులు, షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముందుగా 6వ అంతస్తులోని సిఎం బ్లాకు ప్రారంభించడంతో పాటు తన ఛాంబర్‌లో కెసిఆర్ బాధ్యతలను స్వీకరించనున్నారు.
కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్ర శాంత్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. మూడు షిఫ్టుల్లో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను, వర్క్ ఏజెన్సీలకు సిఎం విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల పురోగతిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. పనులన్నీ సమాంతరంగా, నాణ్యతగా జరగాలని వర్కర్లను పెంచి మూడు షిఫ్టుల్లో నిర్మాణ పనులు జరిగేలా చూడాలని వర్క్ ఏజెన్సీని మంత్రి ఆదేశించారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మెడికల్ విద్యార్థులకు శుభవార్త–ఏపీలో 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు
- కొత్త ODI జెర్సీ విడుదల
- ‘శ్వాస స్వర సంధ్య' తో ఈలపాట మాంత్రికుడు పద్మశ్రీ డా.శివప్రసాద్ మాయాజాలం
- దుబాయ్ లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్..వాహనం సీజ్..!!
- ఇబ్రి గవర్నరేట్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాపాయం..!!
- భవనాల సబ్ డివజన్ కి SR25వేల గరిష్ట జరిమానా..!!
- హైదరాబాద్ లో భారీగా గోల్డ్ బార్స్ స్వాధీనం..!!
- ప్రైవేట్ పాఠశాలలకు BD100,000 వరకు జరిమానాలు..!!
- ఖతార్ లో పుంజుకున్న రెసిడెన్షియల్ రెంటల్ మార్కెట్..!!
- తిరుమల లడ్డూ ధర పెంపు వార్తలు అవాస్తవం: బీఆర్ నాయుడు