రవికాంత్ కి డేట్స్ ఇచ్చిన రానా...
- April 24, 2016
స్టార్ యాక్టర్ రానా డేట్స్ దొరకటం అంటే ప్రస్తుతం చిన్న విషయం ఏ మాత్రం కాదు. ఎందుకంటే బాహుబలి వంటి భారీ విజయం తరువాత రానా కి భారీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి రానా మంచి ఆఫర్స్ ని అందుకుంటున్నాడు. రానాకి పెద్ద పెద్ద దర్శకుల వద్ద నుండి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అయితే కథల విషయంలో రానా కచ్ఛితమైన నిర్ణయాలతో ముందుకు వెళుతున్నాడు.
వచ్చిన ప్రతీ కథని గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా...తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న చిత్రాలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రానా ఓ దర్శకుడికి డేట్స్ ఇవ్వటం సంచలనంగా మారింది. ఈ మధ్య కాలంలో సింగిల్ సిట్టింగ్ లో తన డేట్స్ ని తీసుకున్న దర్శకులు ఎవ్వరూ లేరని రానా అంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న దీనికి సంబంధించిన సమాచారాన్ని చూస్తే, తాజాగా భారీ బడ్జెట్ లేకుండా సంచలన విజయాన్ని సాధించిన మూవీ క్షణం. తెలుగులో మంచి విజయాన్ని చూసిన ఈ మూవీ రీమేక్ రైట్స్ కోసం ఇప్పటికీ గట్టి పోటీ జరుగుతుంది.దీంతో ఈ సినిమాకి దర్శకుడిగా పనిచేసిన రవికాంత్ పేరెపు కి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు రవికాంత్ పేరెపు తదుపరి సినిమాను ప్లాన్చేసుకుంటున్నాడు. తాను లవ్ స్టోరీని రెడీ చేస్తున్నట్టుగా రవికాంత్ అంటున్నారు.ఈ మధ్య కాలంలో తను ఆ స్టోరీని హీరో రానాకి చెప్పాడంట. అందుకు రానా సైతం సింగిల్ సిట్టింగ్ లోనే కథని ఓకే చేయటం, వెంటనే తన డేట్స్ ని ఇవ్వటం వంటివి జరిగాయని ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి. రానా సైతం రవికాంత్ మూవీలో నటించేందకు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ వివరాలు బయటకు రానున్నాయి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







