కీర్తిసురేష్‌కి పెళ్లి చేసుకోబోతోందా.? నిజమేనా.?

- November 28, 2022 , by Maagulf
కీర్తిసురేష్‌కి పెళ్లి చేసుకోబోతోందా.? నిజమేనా.?

హీరోయిన్ల యందు తన రూటే సెపరేటయా అని మహానటిగా కీర్తించబడుతోంది కీర్తి సురేష్. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్ ఆమెది. 
ఆ మాటకొస్తే, టాలీవుడ్‌లోనే కాదు, కోలీవుడ్‌లోనూ కీర్తి సురేష్ స్టార్ హీరోయినే. ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది కీర్తి సురేష్. అయితే, ఈ టైమ్‌లో కీర్తి సురేష్‌కి పెళ్లంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
కీర్తి సురేష్‌కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. ఒక సంబంధం దాదాపు ఓకే అయిపోయిందనీ కీర్తి కూడా ఆ పెళ్లి సంబంధం పట్ల సుముఖంగా వుందనీ, త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేయనున్నారనీ ఆ వార్తల సారాంశం. 
అయితే, నిజంగానే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతోందా.? అంటే ఏమో చెప్పలేం కానీ, ఈ రూమర్ ఇంకాస్త ముందుకెళ్లి పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నటనకు గుడ్ బై చెప్పేస్తుందట.. అని కూడా ప్రచారం జరుగుతోంది. పెళ్లి తర్వాత నిర్మాతగా మారనుందని అంటున్నారు. ఇన్ని బ్రేకింగ్ న్యూస్‌ల మీద బ్రేుకింగ్ న్యూస్‌లిచ్చేశారు లీకు వీరులు.. ఇంతకీ ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కీర్తి సురేష్ స్వయంగా స్పందించాల్సిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com