‘ఉప్పెన’ డైరెక్టర్‌తో చరణ్ కొత్త సినిమా ఫిక్స్.!
- November 28, 2022
కరోనా ప్యాండమిక్ టైమ్‌లో రిలీజైన ‘ఉప్పెన’ సినిమా సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే.100 కోట్లు కొల్లగొట్టి, మెగా హీరో వైష్ణవ్ తేజ్‌కి మంచి డెబ్యూ ఇచ్చింది ఈ సినిమా. సుకుమార్ శిష్యుడయిన బుచ్చిబాబు సన ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు.
ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో బుచ్చిబాబు పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత బుచ్చిబాబు యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరిగింది.అందుకు స్ర్కిప్టు కూడా రెడీ చేసేశాడు బుచ్చిబాబు అన్నారు.
కానీ, తెర వెనుక ఏం జరిగిందో ఏమో, తాజాగా రామ్ చరణ్‌తో తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు బుచ్చిబాబు సన. ‘కొన్నిసార్లు తిరుగుబాటు తప్పదు.. రామ్ చరణ్‌తో నా తదుపరి ప్రాజెక్ట్ ప్రకటిస్తున్నందుకు అమితానందంగా వుంది. వెలకట్టలేని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చరణ్ సార్..’ అంటూ ఆసక్తికరంగా సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించాడు బుచ్చిబాబు సన.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వ్రిద్ధి సినిమాస్ బ్యానర్‌లో వెంకట సతీష్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయ్.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!