మంకీపాక్స్ పేరు మార్పు: WHO
- November 29, 2022
జెనీవా: మంకీపాక్స్ పేరును ఎంపాక్స్‌గా మార్చారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మంకీపాక్స్‌ను ఇకపై ఎంపాక్స్‌గా పిలువనున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు నిపుణులతో వరుస సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏడాది పాటు రెండు పేర్లను వినియోగించనున్నట్లు పేర్కొంది.
మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న సమయంలో పేరు మార్చడం వల్ల తలెత్తే గందరగోళాన్ని నివారించేందుకు రెండు పేర్లను వినియోగించనున్నట్లు వివరించింది. ఎంపాక్స్ ఓ అరుదైన వైరల్ వ్యాధి. మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని వర్షారణ్య ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ తొలిసారిగా గుర్తించారు. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. మంకీపాక్స్ కేసులు మే నుంచి అనేక దేశాల్లో నమోదయ్యాయి.
అమెరికాలోనే దాదాపు 30వేల కేసులు నమోదు అయ్యాయి. ఆఫ్రికా దేశాల్లో వైరస్ స్థానికంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో చాలా వరకు లైంగిక సంబంధాల ద్వారానే సోకినట్లు గుర్తించారు. అయితే, మంకీపాక్స్‌కు టీకా వేయడం ద్వారా పరిస్థితిలో కొంత మేర అడ్డుకట్ట వేయగలిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







