పనికి నిరాకరణ: రిక్రూట్మెంట్ సంస్థలదే కార్మికుల బహిష్కరణ బాధ్యత
- November 29, 2022
రియాద్: డొమెస్టిక్ వర్కర్లు సౌదీ అరేబియాకు వచ్చిన తేదీ నుంచి 90 రోజుల్లో పని చేయడానికి నిరాకరించిన కార్మికులను బహిష్కరించే బాధ్యత రిక్రూట్మెంట్ కార్యాలయాలదేనని మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) ఆధ్వర్యంలోని ముసానేడ్ ప్లాట్‌ఫారమ్ స్పష్టం చేసింది. 90 రోజుల ట్రయల్ వ్యవధిలో రిక్రూట్మెంట్ కార్యాలయాలు, కంపెనీలు కార్మికుడిని బహిష్కరించడానికి.. రిక్రూట్మెంట్ ఖర్చును తిరిగి ఇవ్వడానికి బాధ్యత వహిస్తాయని ముసానేడ్ తెలిపింది. రిక్రూట్మెంట్ కార్యాలయాలు కార్మికుడిని బహిష్కరించడానికి నిరాకరిస్తే, హక్కులు పునరుద్ధరించబడే వరకు కార్మికులు తప్పనిసరిగా ముసానేడ్ ద్వారా ఫిర్యాదును సమర్పించాలని పేర్కొంది. 90-రోజుల వ్యవధి ముగిసిన తర్వాత, కాంట్రాక్ట్ నిబంధనలలో సూచించిన దాని ప్రకారం.. యజమాని కార్మికుడికి బాధ్యత వహిస్తాడని ముసానేడ్ పేర్కొంది. సౌదీ అరేబియాకు చేరుకున్న తేదీ నుండి 90 రోజులలోపు కార్మికులు బహిష్కరణకు గురైనట్లయితే, లబ్ధిదారులకు ప్రభుత్వ రుసుము లేకుండా ప్రత్యామ్నాయ వీసాను జారీ చేయవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ







