ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి..
- November 29, 2022
అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్.జవహర్ రెడ్డి నియామకమయ్యారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న సమీర్ శర్మ ఈ నెల 30, బుధవారం రిటైర్ అవుతున్నారు. దీంతో ఆయన స్థానంలో కేఎస్.జవహర్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డి… ప్రస్తుతం ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వైస్సార్సీపీ అధికారం చేపట్టిన తర్వాత వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన జవహర్ రెడ్డి… ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా బదిలీ అయ్యారు. అంతకుముందు పలు కీలక శాఖల్లోనూ ఆయన పని చేశారు. ఈ పదవి కోసం పలువురి పేర్లు పరిశీలించినప్పటికీ, చివరకు జవహర్ రెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది.
కొత్త సీఎస్‌గా ఎంపికైన జవహర్ రెడ్డి 2024 జూన్ వరకు పదవిలో ఉండే అవకాశం ఉంది. ఇక కొత్త సీఎస్ నియామకంతోపాటు పలువురు ఐఏఎస్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జవహర్ రెడ్డి స్థానంలో సీఎం ముఖ్య కార్యదర్శిగా పూనం మాలకొండయ్యను ఎంపిక చేశారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మధుసూధన్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, ఆర్‌ఆండ్‌బీ కార్యదర్శిగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా రాహుల్ పాండే, హౌజింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్ నియమితులయ్యారు.
తాజా వార్తలు
- GCC e-గవర్నమెంట్ అవార్డుల్లో మెరిసిన ఖతార్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!
- ఫోర్బ్స్ సంపన్నుల జాబితా..దేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ..
- భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్‌లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!