హైదరాబాద్‌ మెట్రో రైల్‌ 5వ వార్షికోత్సవ వేడుకలు...

- November 29, 2022 , by Maagulf
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ 5వ వార్షికోత్సవ వేడుకలు...

హైదరాబాద్‌: ఎల్‌ టీ మెట్రోరైల్‌ (హైదరాబాద్‌ ) లిమిటెడ్‌ (ఎల్‌ – టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌) మరియు హైదరాబాద్‌ మెట్రో రైల్‌  లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) లు  హైదరాబాద్‌ మెట్రో రైల్‌ కార్యకలాపాలు మరియు నిర్వహణను ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి కావడాన్ని సంప్రదాయ తెలంగాణా జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత ప్రదర్శనలతో అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద నేడు వేడుక చేశాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హెచ్‌ఎంఆర్‌ఎల్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌వీఎస్‌ రెడ్డి  హాజరుకాగా, గౌరవ అతిథిగా  ఎల్‌ – టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ –సీఈఓ  కెవీబీ రెడ్డి హాజరయ్యారు. మెట్రో ప్రయాణీకులు, ఎల్‌ – టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ , హెచ్‌ఎంఆర్‌ఎల్‌, కియోలిస్‌, ఫోన్‌పే మరియు ఇతర సంస్ధల ప్రతినిధుల సమక్షంలో వేడుకలను జ్యోతి ప్రకాశనంతో ప్రారంభించారు.

ఈ వేడుకలను పురస్కరించుకుని హెచ్‌ఎంఆర్‌ఎల్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌వీఎస్‌ రెడ్డి అత్యధికంగా మెట్రో ప్రయాణాలు చేసిన మొదటి 15 మంది ప్రయాణీకులను గిఫ్ట్‌ ఓచర్లతో సత్కరించారు. ఫోన్‌పే మరో 10 మంది ప్రయాణీకులను తమ కస్టమర్‌ లాయల్టీ ప్రోగ్రామ్‌ ద్వారా గుర్తించి గిఫ్ట్‌ ఓచర్లను అందజేసింది. తత్త్వ ఆర్ట్స్‌తో భాగస్వామ్యం చేసుకుని హెచ్‌ఎంఆర్‌ , మెట్రో ప్రయాణీకుల కోసం అత్యంత ఉత్సాహపూరితమైన తెలంగాణా జానపద ఒగ్గు కథ మరియు శాస్త్రీయ సంగీత ప్రదర్శనలను ఏర్పాటుచేసింది. సితార్‌,సరోద్‌, తబల  లతో కెకె సిస్టర్స్‌  తమ ప్రదర్శన చేశారు. కళలు, సంస్కృతిని ప్రోత్సహించే రీతిలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ తీర్చిదిద్దిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘మెట్రో మెడ్లీ ’కింద ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా హెచ్‌ఎంఆర్‌ఎల్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా ప్రయాణీకులకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ  ఐదు సంవత్సరాల ప్రయాణంలో వారు మాకందించిన సహకారం వెలకట్టలేనిది.ఈ ప్రయాణంలో మా భాగస్వామి ఎల్‌ – టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌కు ధన్యవాదములు తెలుపుతున్నాము.వీరు మా అంచనాలకనుగుణంగా ఈ ఇంజినీరింగ్‌ అద్భుతాన్ని సృష్టించడంతో పాటుగా హైదరాబాద్‌కు అత్యున్నత శ్రేణి సేవా అనుభవాలను అందిస్తున్నారు.మా ప్రయాణీకులు రోజు రోజుకీ పెరుగుతుండటం ఆనందంగా ఉంది. రాబోయే రోజులలో అత్యద్భుతమైన, అనుసంధానితమైన అనుభవాలను మెట్రో రైల్‌ సేవలను వినియోగించి  వారికి అందించడానికి కట్టుబడి ఉన్నాము’’ అని అన్నారు.

ఐదవ వార్షికోత్సవ సందర్భంగా తన ఆనందాన్ని  ఎల్‌ – టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌  ఎండీ –సీఈఓ కెవీబీ రెడ్డి వ్యక్తీకరిస్తూ  ‘‘హెచ్‌ఎంఆర్‌ యొక్క ఈ ఓ అండ్‌ ఎం ఐదు సంవత్సరాల మైలురాయి చేరుకోవడం పట్ల మా ప్రయాణీకులకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారు మా పట్ల అచంచలమైన విశ్వాసం చూపడంతో పాటుగా వారికి సేవలనందించే అవకాశం కల్పించారు.  స్ధిరంగా మాకు సహాయపడటంతో పాటుగా మద్దతు అందిస్తోన్న హెచ్‌ఎంఆర్‌ఎల్‌ , రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా ఓ అండ్‌ ఎం భాగస్వామి కియోలిస్‌ మరియు ఈ ప్రయాణం విజయవంతం కావడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ  కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అత్యంత విశ్వసనీయమైన హరిత రవాణా భాగస్వామిగా నగరానికి మహోన్నత సేవలనందించడానికి  హెచ్‌ఎంఆర్‌ కట్టుబడి ఉంది’’ అని అన్నారు

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ మరియు దాని ప్రయాణీకులను అభినందించిన ఫోన్‌పే  డైరెక్టర్‌  రితురాజ్‌ రౌతేజా మాట్లాడుతూ ‘‘నగర ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాలను అందించడంలో  విజయవంతంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్‌ మెట్రోను అభినందిస్తున్నాను. 2020లో  మేము వీరితో భాగస్వామ్యం చేసుకుని డిజిటల్‌ క్యుఆర్‌ టిక్కెట్లను హైదరాబాద్‌ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చాము.తద్వారా ప్రయాణీకులకు సురక్షితమైన, అతి సులభమైన టిక్కెటింగ్‌ అనుభవాలను అందించే అవకాశం కలిగింది. హైదరాబాద్‌ మెట్రో స్మార్ట్‌ కార్డును ఫోన్‌పే స్విచ్‌ పై రీచార్జ్‌ చేయడం, నగరంలోని మెట్రో స్టేషన్‌ల వద్ద పేపర్‌ క్యుఆర్‌ టిక్కెట్‌ల కోసం స్కాన్‌ అండ్‌ పే అవకాశాలనూ తీసుకువచ్చాము. ఈ మైలురాయి వేడుక చేసే వేళ మెట్రో అధికారులు మరియు ఫోన్‌పే  యొక్క సమ్మిళిత ప్రయత్నాలు అందిస్తున్న ప్రయోజనాలను చూడటం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com