భారత్‌లో అమెజాన్ డిస్ట్రిబ్యూషన్ మూసివేతకు చర్యలు
- November 30, 2022
న్యూ ఢిల్లీ: ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దేశంలోని తమ వ్యాపార కార్యకలాపాల్లో ఒక్కోదాని నుంచి తప్పుకుంటుంది. ఇప్పటికే దేశంలో ఫుడ్ డెలివరీ, ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫారమ్ అకాడమీ అనే రెండు వ్యాపారాలనుంచి తప్పుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్‌లో పనిచేస్తున్న సుమారు 10వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ వచ్చే ఏడాది కూడా సాగుతుందని అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీ జాస్సీ తెలిపారు.
భారతదేశంలో ఫుడ్ డెలివరీ వ్యాపారం నుంచి, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫారమ్ అకాడమీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన అమెజాన్ తాజాగా వారంరోజుల్లో మూడవ వ్యాపార రంగం నుంచి తప్పుకునేందుకు సిద్ధమైంది. దేశంలో తమ హోల్‌సేల్ విభాగంలోని అమెజాన్ డిస్ట్రిబ్యూషన్‌ను మూసివేస్తున్నట్లు ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది. అయితే హోల్ సేల్ బీ2బీ మార్కెట్ ప్లేస్ మాత్రం యథాప్రకారం కొనసాగుతుందని తెలిపింది. వార్షిక సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు.
అమెజాన్ డిస్ట్రిబ్యూషన్ ప్రస్తుతం కర్ణాటకలోని మూడు జిల్లాల్లోని (బెంగళూరు, మైసూరు, హుబ్లి) చిన్న దుకాణాదారులకు పరిమిత స్థాయిలో సర్వీసులందిస్తోంది. ప్రస్తుత కస్టమర్లు, భాగస్వాములకు ఇబ్బందులు కలగకుండా దశలవారీగా అమెజాన్ డిస్ట్రిబ్యూషన్ ను నిలిపివేయనున్నట్లు అమెజాన్ ప్రతినిధి వివరించారు.
తాజా వార్తలు
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్‌లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!
- అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్ అభివృద్ధికి ఒప్పందం..!!