హైదరాబాద్‌లో అక్రమంగా డ్రగ్స్ సరఫరా.. అంతర్రాష్ట్ర ముఠాలు అరెస్టు
- November 30, 2022
హైదరాబాద్: హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు అయింది. నగరంలో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్ నుంచి హైదరాబాద్ కు మత్తు మందు దిగుమతి చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను మల్కాజిగిరి ఎస్ వోటీ, నేరేడ్ మెట్ పోలీసులు అరెస్టు చేశారు.
వారి నుంచి 750 గ్రాముల ఓపీఎం, 500 గ్రాముల పాపిస్టా స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వాటి విలువ రూ.12.5 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. వారు ప్రయణిస్తున్న కారును కూడా సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. నగరంలోని వ్యాపారస్తులకు డ్రగ్స్ అమ్ముతున్నట్లు విచారణలో తేలింది.
మరోవైపు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మరో నలుగురిని ఎల్ బీ నగర్ ఎస్ వోటీ, సరూర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 12 గ్రాముల హెరాయిన్, నాలుగు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!
- అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్ అభివృద్ధికి ఒప్పందం..!!
- ఆసియాకప్ ట్రోఫీని తీసుకెళ్లిన నఖ్వీ..
- బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి
- ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!
- జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!