రష్మికను బ్యాన్ చేస్తే వాళ్లకే నష్టం అంటోన్న డైరెక్టర్.!
- November 30, 2022
ఏరు దాటాకా, తెప్ప తగిలేయడం అంటారు కదా.. ఆ తరహా కామెంట్లే ప్రస్తుతం రష్మికపై వినిపిస్తున్నాయ్. కన్నడ సినిమా ‘కిర్రిక్ పార్టీ’తో రష్మిక హీరోయిన్గా పరిచయమైంది. ఆ సినిమానే రష్మికకు తిరుగులేని క్రేజ్ తీసుకొచ్చింది.
రష్మిక పేరు కన్నడలోనే కాదు, తెలుగులోనూ మార్మోగిపోవడానికి కారణం ఆ సినిమానే. అయితే, ఆ ప్రస్థావన తీసుకురావడానికి రష్మిక అస్సలు ఇష్టపడడం లేదు ఇప్పుడు.
దాంతో, కన్నడిగులు రష్మికపై గుస్సా అవుతున్నారు. ఆమెను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్గా సంచలనాలు నమోదు చేసిన ‘కాంతార’ సినిమా కూడా రష్మికపై కన్నడిగుల గుస్సాకి కారణం. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమాని రష్మిక చూడలేదని చెప్పడం వివాదాలకు కారణమైంది.
తాజాగా ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ప్రమోషన్లలో డైరెక్టర్ నాగశేఖర్ ఈ విషయంపై స్పందించాడు. రష్మికను బ్యాన్ చేస్తే కన్నడ పరిశ్రమకే నష్టం. అయినా కృతజ్ఞతను ఆశిస్తే ఎప్పుడోకప్పుడు ఇలాగే బాధపడాల్సి వస్తుంది. సాయాన్ని గుర్తు పెట్టుకోవడం.. గుర్తుపెట్టుకోకపోవడం అనేది సాయం పొందిన ఆయా వ్యక్తుల వ్యక్తిగతం అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రష్మిక, టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా చెలామణీ అవుతోంది. అలాగే బాలీవుడ్లోనూ సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి
- అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు
- డా.బంగారి రజనీ ప్రియదర్శినికి టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!