వివాహ వేడుకలో వృద్ధుడిని కొట్టిన యువకుడు అరెస్ట్

- November 30, 2022 , by Maagulf
వివాహ వేడుకలో వృద్ధుడిని కొట్టిన యువకుడు అరెస్ట్

సౌదీ అరేబియా: ఓ వివాహ వేడుకలో ఒక యువకుడు వృద్ధుడిని ముఖంపై కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. ఓ వివాహ వేడుకలో జరిగిన ఈ సంఘటనకు కారణమైన ఇరువురి మధ్య గతంలో వివాదం ఉందని పేర్కొంది. వైరల్ వీడియోలో అనేక మంది వ్యక్తులు ఒకరికొకరు ఎదురుగా రెండు వరుసలలో నిలబడి ఉన్నారు. వారిలో ఒకరు ప్రసంగించారు. ఆహుతులకు స్వాగతం పలికి శాంతిని అందించాడు. ప్రసంగం ముగియగానే.. అనుహ్యంగా ఓ యువకుడు ముందుకు వచ్చి ఓ వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇతరులు జోక్యం చేసుకొని ఇరువర్గాల మధ్య పరిస్థితిని అదుపు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com