గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభం
- December 01, 2022
గుజరాత్: గుజరాత్ అసెంబ్లీ మొదటి విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం ఎన్నికల సంఘం 14,382 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. తొలి విడుతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాల్లో 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
బిజెపి, కాంగ్రెస్, ఆప్ సహా 36 రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నాయి. బిజెపి, కాంగ్రెస్ మొత్తం సీట్లలో అభ్యర్థులను నిలపగా, ఆప్ 88 స్థానాల్లో, బీఎస్పీ 57 మందిని నిలబెట్టింది. వీరితోపాటు 339 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 5న మలివిడుత పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజా వార్తలు
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్‌లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!