తెల్లవారు జామున 4.01 నిమిషాలకు సచివాలయం ప్రారంభం
- April 24, 2016
తెల్లవారు జామున 4.01 నిమిషాలకు ప్రారంభం సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ భవనానికి వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం చేశారు. సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటల ఒక్క నిమిషానికి భవనంలోకి ప్రవేశించి తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ నెల తరువాత సరైన ముహూర్తాలు లేవనే కారణంతో హడావుడిగా ఈ ముందస్తు ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఎల్ అండ్ టీ నిర్మిస్తున్న నాలుగో బ్లాకులో ఇందుకోసం ఒక గది(33 566 సైజులో)ని ఆగమేఘాల మీద సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడితో ఎల్ అండ్ టీ యుద్ధప్రాతిపదికన ఆ పనులు చేస్తోంది. మొదట రెండు గదులు సిద్ధం చేయాలని చూసినా.. రెండు రోజుల్లో అది సాధ్యమయ్యే పనికాకపోవడంతో ఒకదాన్నే అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, పలువురు అధికారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







