‘హిట్ ది సెకండ్ కేస్’: మూవీ రివ్యూ

- December 03, 2022 , by Maagulf
‘హిట్ ది సెకండ్ కేస్’: మూవీ రివ్యూ

నటీనటులు: అడవి శేష్, మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి తదితరులు
డైరెక్టర్: శైలేష్ కొలను
సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్
ఎడిటర్: గర్రి బి.హెచ్

‘మేజర్’ సినిమాతో ప్యాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అడవి శేష్. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ ది ఫస్ట్ కేస్ సక్సెస్ అవ్వడంతో, ఈ సినిమాకి ప్రాంఛైజీ అంటూ ‘హిట్ ది సెకండ్ కేస్’ పట్టాలెక్కింది. ఈ సెకండ్ కేస్ కోసం అడవి శేష్ ఛార్జ్ తీసుకున్నాడు. ప్రమోషన్లు గట్టిగా నిర్వహించడంతో జనంలోకి బాగా దూసుకెళ్లింది ‘హిట్ ది సెకండ్ కేస్.’ మరి, ఈ సెకండ్ కేస్ హిట్ అనిపించుకుందో లేదో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
కేడీ అలియాస్ కృష్ణ దేవ్ పవర్ ఫుల్ క్రైమ్ పోలీసాఫీసర్. ఓ క్రైమ్ కేస్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా సంజన అను అమ్మాయి డెడ్ బాడీని గుర్తిస్తారు కేడీ అండ్ టీమ్. అయితే, ఆ బాడీలోని పార్టులన్నీ కేవలం ఒక్క అమ్మాయికి చెందినవి కాదు. రకరకాల బాడీ పార్టుల్ని అతికించి పడేస్తాడు సైకో కిల్లర్. ఆ సైకో కిల్లర్‌ని పట్టుకోవడానికి కేడీ అండ్ టీమ్ ఏం చేసింది.? ఈ కేస్ ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో బయట పడిన భయంకరమైన నిజాలేంటీ.? తెలియాలంటే ‘హిట్ ది సెకండ్ కేస్’ ధియేటర్లో చూడాల్సిందే. 

నటీనటుల పని తీరు:
కేడీ పాత్రలో అడవి శేష్ ఒదిగిపోయాడు. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రే అయినా, కొంత వెటకారం, మరికొంత ఆటిట్యూడ్ మిక్స్ అయిన పాత్ర అది. ఆ పాత్రను అడవి శేష్ బాగానే క్యారీ చేశాడు. హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. అఫ్‌కోర్స్.! ఇలాంటి ప్రామిసింగ్ క్రైమ్ థ్రిల్లర్స్‌లో హీరోయిన్ పాత్రకు అంతే ప్రాధాన్యత దక్కుతుందనుకోండి. కేడీ అసిస్టెంట్‌గా కోమలి ప్రసాద్ పాత్ర కొంత మేర ఆకట్టుకుంటుంది. మిగిలిన పాత్ర ధారులు రావు రమేష్, పోసాని కృష్ణ మురళి తదితరులు వారి పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సినిమా చివరిలో నాని గెస్ట్ అప్పియరెన్స్ అప్లాజింగ్‌గా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం పని తీరు:
రకరకాల సీరియల్ కిల్లర్స్ కథాంశాలను తెరపై ఇప్పటికే చూశాం. వాటన్నింట్లోకీ హిట్ 2 కోసం ఎంచుకున్న సబ్జెక్ట్ కాస్త భిన్నంగానే అనిపిస్తుంది. స్లోగా స్టార్ట్ చేసి, కథను వేగంగా నడిపిన తీరుకు డైరెక్టర్ శైలేష్ కొలనుకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయ్. అయితే తర్వాత ఏం జరుగుతుంది.. అనేది ప్రేక్షకుడు ఊహించేయగలగడంతో కాస్త థ్రిల్లింగ్ మిస్ అవుతాం. బట్ ఓవరాల్‌గా ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఆ థ్రిల్‌ని కవర్ చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఫస్టాఫ్‌లో ఎడిటింగ్‌కి ఇంకాస్త పదును పెడితే బాగుండేది. నిర్మాణ విలువలు రిచ్‌గా వున్నాయ్. 

ప్లస్ పాయింట్స్:
పరుగులు పెట్టించే స్క్రీన్‌ప్లే
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్:
స్లోగా కథను ఎత్తుకోవడం.

చివరిగా 
‘హిట్ ది సెకండ్ కేస్’‌ ఓకే టార్గెట్ రీచ్ అవుతారు.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com