బుర్జ్ ఖలీఫా 160 అంతస్తులను 38 నిమిషాల్లో అధిరోహించిన షేక్ హమ్దాన్

- December 03, 2022 , by Maagulf
బుర్జ్ ఖలీఫా 160 అంతస్తులను 38 నిమిషాల్లో అధిరోహించిన షేక్ హమ్దాన్

దుబాయ్: బుర్జ్ ఖలీఫాలోని 160 అంతస్తులను 38 నిమిషాల్లో అధిరోహించి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ రికార్డు సృష్టించాడు. "బుర్జ్ ఖలీఫా ఛాలెంజ్" అనే క్యాప్షన్‌తో షేక్ హమ్దాన్ దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలను షేర్ చేశాడు. బుర్జ్ ఖలీఫా దగ్గర హమ్దాన్, అతని బృందం సభ్యులు ఎక్కడం ప్రారంభించినప్పటి నుంచి వీడియో ప్రారంభమవుతుంది. వీడియోలో హమ్దాన్, ఇతరులు మెట్ల మీదుగా వెళ్లడం చూపించారు. 160వ అంతస్తుకు వారందరూ చేరుకోవడంతో వీడియో ముగుస్తుంది.
బుర్జ్ ఖలీఫా 160 అంతస్తులను అధిరోహించడానికి షేక్ హమ్దాన్ 37:38 పట్టినట్లు వీడియోలో చూపించారు. అతను 710 కేలరీలు కరిగించాడు. అతని సగటు హృదయ స్పందన రేటు 162గా నమోదైంది. ( కనిష్టంగా 107, గరిష్ట రేటు 186). దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఫిట్‌నెస్ స్థాయిని చూసి సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 15 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com