బహ్రెయిన్‌లో పెరుగుతున్న మధుమేహులు
- April 24, 2016
మధుమేహం (డయాబెటిస్)తో బాధపడుతున్నవారి సంఖ్య బహ్రెయిన్‌లో క్రమక్రమంగా పెరుగుతోంది. 2015లో నిర్వహించిన ఓ సర్వేలో మధుమేహం కేసుల పెరుగుదలకు సంబంధించి బహ్రెయిన్ ఏడవ స్థానంలో నిలిచింది. జిసిసి దేశాల్లో బహ్రెయిన్‌కి మూడవ స్థానం లభించింది. సౌదీ అరేబియా, కువైట్ ముందంజలో వున్నాయి. డయాబెటిస్ వంశపారంపర్యంగా కొన్ని కేసుల్లో వెలుగు చూస్తోంటే, చాలావరకు అధిక బరువు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వంటివాటి వల్ల ఇంకా ఎక్కువ కేసుల్లో ఈ వ్యాధి కనిపిస్తోంది. మధుమేహం / డయాబెటిస్తో బాధపడుతున్నవారిలో 25 శాతం మంది కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నట్లు సల్మానియా మెడికల్ కంప్లెక్స్ ఐ కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ మొహమ్మద్ నయీమ్ నాజర్ చెప్పారు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా అనేక ఇతర రోగాల్ని దూరం చేసుకోవచ్చనీ, ఓసారి మధుమేహం వచ్చాక అదుపులో పెట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదని ప్రముఖ వైద్యులు వెల్లడించారు. మధుమేహానికి రక్తపోటు తోడైతే గుండెపోటు, కిడ్నీలు పాడవడం, శరీరంలోని ఇతర కీలక అవయవాల పనితీరు మందగడించడం జరుగుతందని వైద్యులు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







