బర్డ్ ఫ్లూ భయంతో లెబనీస్ పౌల్ట్రీపై నిషేధం
- April 24, 2016
లెబనాన్ నుంచి పౌల్ట్రీ దిగుమతులపై బహ్రెయిన్ నిషేధం విధించింది. మునిసిపాలిటీ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీ, అగ్రిక్లచర్ అండ్ మెరైన్ రిసోర్సెస్ డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశాయి. బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూడ్డంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే లెబనాన్ నుంచి కోళ్ళ దిగుమతికి అనుమతి పొందినప్పటికీ, ఆ అనుమతుల్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నామనీ, తదుపరి ఉత్తర్వులు విడుదలయ్యేదాకా ఈ నిషేధం వర్తిస్తుందని అధికారులు చెప్పారు. గత కొద్ది రోజులుగా లెబనీస్ మీడియా, దేశంలో వెలుగు చూసిన బర్డ్ ఫ్లూ కేసులపై కథనాల్ని ప్రసారం చేస్తోంది. దాంతో, లెబనీస్ ఫామ్స్ మరియు ఫుడ్ సెక్యూరిటీ రంగం తీవ్రంగా దెబ్బతింది. బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కడ వెలుగు చూసినా, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ అప్రమత్తమవుతుంటాయి. వేల సంఖ్యలో, ఒక్కోసారి లక్షల సంఖ్యలో బర్డ్ ఫ్లూ అనుమానాలతోనే కోళ్ళను దహనం చేస్తుంటారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







