బహ్రెయిన్‌లో పెరుగుతున్న మధుమేహులు

- April 24, 2016 , by Maagulf
బహ్రెయిన్‌లో పెరుగుతున్న మధుమేహులు

మధుమేహం (డయాబెటిస్‌)తో బాధపడుతున్నవారి సంఖ్య బహ్రెయిన్‌లో క్రమక్రమంగా పెరుగుతోంది. 2015లో నిర్వహించిన ఓ సర్వేలో మధుమేహం కేసుల పెరుగుదలకు సంబంధించి బహ్రెయిన్‌ ఏడవ స్థానంలో నిలిచింది. జిసిసి దేశాల్లో బహ్రెయిన్‌కి మూడవ స్థానం లభించింది. సౌదీ అరేబియా, కువైట్‌ ముందంజలో వున్నాయి. డయాబెటిస్‌ వంశపారంపర్యంగా కొన్ని కేసుల్లో వెలుగు చూస్తోంటే, చాలావరకు అధిక బరువు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వంటివాటి వల్ల ఇంకా ఎక్కువ కేసుల్లో ఈ వ్యాధి కనిపిస్తోంది. మధుమేహం / డయాబెటిస్‌తో బాధపడుతున్నవారిలో 25 శాతం మంది కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నట్లు సల్మానియా మెడికల్‌ కంప్లెక్స్‌ ఐ కన్సల్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ నయీమ్‌ నాజర్‌ చెప్పారు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా అనేక ఇతర రోగాల్ని దూరం చేసుకోవచ్చనీ, ఓసారి మధుమేహం వచ్చాక అదుపులో పెట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదని ప్రముఖ వైద్యులు వెల్లడించారు. మధుమేహానికి రక్తపోటు తోడైతే గుండెపోటు, కిడ్నీలు పాడవడం, శరీరంలోని ఇతర కీలక అవయవాల పనితీరు మందగడించడం జరుగుతందని వైద్యులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com