అంబేద్కర్ వర్థంతి..ప్రధాని, రాష్ట్రపతి నివాళులు
- December 06, 2022
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డా.బాబాసాహెబ్ అంబేద్కర్‌కు నివాళులర్పించారు. బాబాసాహెద్ అంబేద్కర్ వర్థంతి నేపథ్యంలో న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లాన్స్‌లో ప్రధాని మోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్ కర్, స్పీకర్ ఓం బిర్లా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. మన దేశానికి ఆయన చేసిన ఆదర్శప్రాయమైన సేవను స్మరించుకుంటున్నానని, అంబేద్కర్ పోరాటం వల్ల లక్షలాది మందిలో ఆశ చిగురించాయని ప్రధాని ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించడానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని కొనియాడారు.
మనందరం సమానమని, మనందరం భారతీయులమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వీటన్నింటికీ విరుద్దమైన వాటిని బాబాసాహెబ్ ఆమోదించరని, ఆయన బాటలో నడిచే మనకు కూడా ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కు నివాళి అర్పిస్తూ పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







