ఆకుకూరల జ్యూస్‌

- April 25, 2016 , by Maagulf
ఆకుకూరల జ్యూస్‌

కావలసిన పదార్థాలు: క్యారెట్‌ - ఒకటి, కీరా - ఒకటి, మెంతికూర ఆకులు - పావు కప్పు, క్యాబేజి ఆకులు - రెండు, కాలిఫ్లవర్‌ ఆకులు - ఒకటి, కొత్తిమీర - నాలుగు రెమ్మలు, బ్రొకోలి - కొద్దిగా, బచ్చలి ఆకులు - ఆరు.

తయారుచేయు విధానం: అన్నిట్నీ శుభ్రంగా కడిగి కుక్కర్‌లో ఒక విజిల్‌ వచ్చేవరకూ ఉడికించి దించేయాలి. చల్లారాక మిక్సీలో జ్యూస్‌ చేసుకోవాలి. ఈ జ్యూస్‌కు కొంచెం ఉప్పు కానీ పంచదార కానీ కలుపుకోవాలి. ఆ తర్వాత కొంత సేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఈ జ్యూస్‌ తాగడం వల్ల అలసట తొందరగా తగ్గుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com