ఛీ. పాడు.! పబ్లిసిటీ కోసం వర్మ ఇంతలా దిగజారాలా.?
- December 07, 2022
వివాదాల గురించి , డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎప్పుడూ ఏదో ఇక వివాదంతో సావాసం చేస్తుంటారాయన. తాజాగా తన సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ బ్యూటీతో జత కట్టాడు రామ్ గోపాల్ వర్మ.
అదేంటీ.? ఆయన సినిమా కోసం బిగ్‌బాస్ బ్యూటీతో జత కట్టుడేందీ.? అంటారా.! అదంతే, ఆయన వర్మ.. మన కర్మ. బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డితో గతంలో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేసి ఇటు రామ్ గోపాల్ వర్మ, అటు అషూ రెడ్డి ఇద్దరూ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
లెజ్బియన్ రొమాన్స్ కాన్సెప్ట్‌తో వర్మగారు తెరకెక్కించిన అడల్ట్ మూవీ ‘డేంజరస్’ అప్పుడెప్పుడో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టైంలో రిలీజ్ కావల్సి వుండగా, అప్పుడు ఆ రిలీజ్‌ని ఆపేశారు.
ఇంకేముంది.. ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్‌లో అప్పుడు ఆ సినిమాకి బిల్డప్ ఇచ్చేశాడు రామ్ గోపాల్ వర్మ. తీరా చూస్తే, సినిమా రిలీజే ఆగిపోయింది. మళ్లీ ఈ నెల 9న ‘డేంజరస్’ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
రిలీజ్ అవుతుందో లేదో తెలీని ఈ సినిమాకి అషూ రెడ్డితో బోల్డ్ ప్రమోషన్లు ప్లాన్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. అత్యంత జుగుప్సాకరంగా అషూ రెడ్డితో కలిసి బోల్డ్ షోకి దిగజారిపోయాడు రామ్ గోపాల్ వర్మ. అషూతో వర్మ ‘ఛీ.!’ పాడు చేష్టలకి విస్తుపోతున్నారు సినీ జనం.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







