‘విరూపాక్ష’గా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త అవతార్.!
- December 07, 2022
యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా కోలుకున్న తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సైలెంట్‌గా ఓ సినిమాని పూర్తి చేసేశాడు. ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా, సుకుమార్ స్ర్కీన్‌ప్లే అందించడం విశేషం.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి అప్‌డేట్ వచ్చింది. ఓ అరుదైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాకి ‘విరూపాక్ష’ అనే టైటిల్‌ని కన్‌ఫామ్ చేశారు. సినిమా రిలీజ్ డేట్‌ని వచ్చే ఏడాది ఏప్రిల్ 21కి ముందస్తుగానే లాక్ చేశారు.
ఇక సినిమా విషయానికి వస్తే, మూఢ నమ్మకాలపై జరిగే యుద్ధంగా ఈ సినిమాని చెబుతున్నారు. పల్లెటూళ్లలో జరిగే, బ్లాక్ మ్యాజిక్స్, చేతబడులు.. తదితర వ్యవహారాలపై ఈ సినిమాని సీరియస్ టోన్‌లో రూపొందించారట.
కాన్సెప్ట్ రెగ్యులర్‌లాగానే అనిపించినా, తేజు యాక్టింగ్, సుకుమార్ స్క్రీన్‌ప్లేతో సినిమా వేరే లెవల్‌కి వెళ్లిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఈ సినిమాకి యంగ్ టైగర్ ఎన్టీయార్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే.
సీరియస్ మోడ్ కాన్సెప్ట్ కావడంతో, ఎన్టీయార్ వాయిస్ చాలా బాగా సెట్టయ్యిందనీ, ఫైనల్ అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందనీ అంటున్నారు. ‘రిపబ్లిక్’ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన తేజు, ‘విరూపాక్ష’గా చేయబోతున్న సాహసం ఫలిస్తుందో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







