30 మిలియన్ దిర్హాములు గెలుచుకున్న భారత కార్ వాష్ వర్కర్...

- December 08, 2022 , by Maagulf
30 మిలియన్ దిర్హాములు గెలుచుకున్న భారత కార్ వాష్ వర్కర్...

అబుధాబి: అబుధాబి బిగ్ టికెట్ ర్యాఫిల్ లో భారత్‌కు చెందిన కథార్ హుస్సేన్ ఏకంగా 30 మిలియన్ దిర్హాములు గెలుచుకున్న విషయం తెలిసిందే.ఈ నెల 3వ తేదీన( శనివారం ) సాయంత్రం అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో తీసిన ర్యాఫిల్ డ్రాలో షార్జాలో ఉండే కథార్‌కు ఈ జాక్‌పాట్ తగిలింది.తీరా లాటరీ నిర్వాహకులు కాల్ చేసి అతనికి ఈ విషయం చెబుదామనుకుంటే ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.ఆ సమయంలో కథార్ యూఏఈలో విహారయాత్రలో ఉన్నాడట.కానీ డ్రాను లైవ్‌లో చూశాడు.దాంతో తాను భారీ ప్రైజ్‌మనీ గెలుచుకున్న విషయం తెలిసింది.

అంతే.. ఏమాత్రం ఆలస్యం చేకుండా టికెట్ బుక్ చేసుకుని రిటర్న్ ఫ్లైట్‌ ఎక్కేశాడు.షార్జా వచ్చిన తర్వాత నిర్వాహకులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.కథార్ హుస్సేన్ షార్జాలో ఉండే భారత ప్రవాసుడు కథార్ హుస్సేన్‌ది తమిళనాడు రాష్ట్రం.27 ఏళ్ల కథార్ షార్జాలోని ఓ కార్ వాష్ కంపెనీలో పని చేస్తున్నాడు. దానికి గాను అతనికి నెలకు 1500 దిర్హాములు జీతం వస్తుంది. అలాగే కస్టమర్లు టిప్స్ ఇస్తుంటారు.వాటితోనే కథార్ నవంబర్ 6వ తేదీన 246 సిరీస్‌లో 206975 నంబర్ గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ సర్వీస్‌ ద్వారా కొన్నాడు.ఇంకో విషయం ఏంటంటే 2 టికెట్లు కొంటే.. ఒక టికెట్ ఫ్రీ అనే ఆఫర్ సందర్భంగా కథార్ ఈ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com