30 మిలియన్ దిర్హాములు గెలుచుకున్న భారత కార్ వాష్ వర్కర్...
- December 08, 2022
అబుధాబి: అబుధాబి బిగ్ టికెట్ ర్యాఫిల్ లో భారత్‌కు చెందిన కథార్ హుస్సేన్ ఏకంగా 30 మిలియన్ దిర్హాములు గెలుచుకున్న విషయం తెలిసిందే.ఈ నెల 3వ తేదీన( శనివారం ) సాయంత్రం అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో తీసిన ర్యాఫిల్ డ్రాలో షార్జాలో ఉండే కథార్కు ఈ జాక్‌పాట్ తగిలింది.తీరా లాటరీ నిర్వాహకులు కాల్ చేసి అతనికి ఈ విషయం చెబుదామనుకుంటే ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.ఆ సమయంలో కథార్ యూఏఈలో విహారయాత్రలో ఉన్నాడట.కానీ డ్రాను లైవ్‌లో చూశాడు.దాంతో తాను భారీ ప్రైజ్‌మనీ గెలుచుకున్న విషయం తెలిసింది.
అంతే.. ఏమాత్రం ఆలస్యం చేకుండా టికెట్ బుక్ చేసుకుని రిటర్న్ ఫ్లైట్ ఎక్కేశాడు.షార్జా వచ్చిన తర్వాత నిర్వాహకులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.కథార్ హుస్సేన్ షార్జాలో ఉండే భారత ప్రవాసుడు కథార్ హుస్సేన్ది తమిళనాడు రాష్ట్రం.27 ఏళ్ల కథార్ షార్జాలోని ఓ కార్ వాష్ కంపెనీలో పని చేస్తున్నాడు. దానికి గాను అతనికి నెలకు 1500 దిర్హాములు జీతం వస్తుంది. అలాగే కస్టమర్లు టిప్స్ ఇస్తుంటారు.వాటితోనే కథార్ నవంబర్ 6వ తేదీన 246 సిరీస్‌లో 206975 నంబర్ గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ సర్వీస్ ద్వారా కొన్నాడు.ఇంకో విషయం ఏంటంటే 2 టికెట్లు కొంటే.. ఒక టికెట్ ఫ్రీ అనే ఆఫర్ సందర్భంగా కథార్ ఈ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







