గుజరాత్లో బిజెపి.. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఆధిక్యం
- December 08, 2022
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలుపెట్టగా దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం గుజరాత్లో బిజెపి మరోమారు అధికారం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 124 స్థానాల్లో బిజెపి, 43 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
హిమాచల్ ప్రదేశ్లో బిజెపి, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తోంది. అయితే, బిజెపి కంటే కాంగ్రెస్ కాస్తంత ముందంజలో ఉంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బిజెపి 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు ఐదు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ‘ఆప్’ ఇంకా ఖాతా తెరవలేదు. తాజా సరళి చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







