ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- February 05, 2026
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీలు కుట్రతోనే ప్రధాని మోదీ సీటును చుట్టుముట్టారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆరోపించారు.అందుకే ఆయన భద్రత దృష్ట్యా సభకు రావద్దని ప్రధానికి సలహా ఇచ్చానని చెప్పారు.దీంతో ప్రసంగాన్ని మోదీ రద్దు చేసుకున్నారని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రధాని మోదీ లోక్‌సభలో బుధవారం ప్రసంగించాల్సి ఉన్నది. అయితే దీనికి ముందు సభలో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్షాలకు చెందిన మహిళా ఎంపీలు ప్రధాని సీటు ముందు నిల్చొని నిరసన తెలిపారు.ఈ గందరగోళం నేపథ్యంలో లోక్‌సభ వాయిదా పడింది.
కాగా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla)ఈ సంఘటనపై సభలో గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎంపీలు తన చైర్‌ను చుట్టుముట్టి దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపించారు. ప్రధాని ప్రసంగ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపీలు గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించవచ్చని తనకు ముందే సమాచారం ఉన్నట్లు తెలిపారు. ‘కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సభ్యులు ప్రధానమంత్రి సీటు వద్దకు వెళ్లి ఊహించని సంఘటనకు పాల్పడవచ్చని నాకు విశ్వసనీయ సమాచారం అందింది. అలాంటి సంఘటన జరిగి ఉంటే, అది దేశ గౌరవానికి తీవ్ర నష్టం కలిగించి ఉండేది. అందుకే ప్రధానమంత్రిని పార్లమెంటుకు రావద్దని నేను కోరా’ అని అన్నారు. మరోవైపు రాజకీయ విభేదాలను స్పీకర్ కార్యాలయం వరకు తీసుకురావడం ఈ సభ సంప్రదాయం కాదని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. లోక్‌సభలో బుధవారం జరిగిన సంఘటన పార్లమెంటు చరిత్రలో ఒక మాయని మచ్చ అని అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







