హైదరాబాద్ విమానాశ్రయంలో నూతన అంతర్జాతీయ అరైవల్ హాల్ ప్రారంభం

- December 09, 2022 , by Maagulf
హైదరాబాద్ విమానాశ్రయంలో నూతన అంతర్జాతీయ అరైవల్ హాల్ ప్రారంభం

హైదరాబాద్: GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణలో భాగంగా ఈ రోజు కొత్త ఇంటర్నేషనల్ అరైవల్ హాల్‌ను ప్రారంభించారు. 12,715 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన కొత్త అరైవల్ హాల్ ను అందమైన ఇండోర్ ల్యాండ్‌స్కేప్, వాటర్ ఫౌంటెన్లు, ఆకర్షణీయమైన డిజైన్ ఫీచర్ వాల్స్ తో ప్రయాణీకుల కంటికి ఇంపుగా తీర్చిదిద్దారు. నిరాటంకమైన ప్రయాణం కోసం అరైవల్ హాల్‌లో రెండు జతల ఎలివేటర్‌లు, ఎస్కలేటర్‌లు, మెట్లు ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ జోన్ నుండి కొత్త బ్యాగేజీ రీక్లెయిమ్ హాల్‌కి దారి తీస్తాయి. తద్వారా ఇవి ప్రస్తుత, కొత్త భవనాలను కలుపుతాయి. కొత్తగా నిర్మించిన బ్యాగేజ్ రీక్లెయిమ్ హాల్‌లో డ్యూయల్ ఫీడ్‌ కలిగిన 5 బ్యాగేజ్ రీక్లెయిమ్ బెల్ట్‌లు, 10 ఇన్-లైన్ స్క్రీనింగ్ మెషీన్‌లు బ్యాగేజీ డెలివరీ సమయాన్ని తగ్గిస్తాయి. ప్రయాణీకులను కలవడానికి వచ్చే వారి కోసం, అరైవల్ హాల్ వెలుపల 3500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త మీటర్-గ్రీటర్ స్థలం కూడా ఏర్పాటు చేసారు. ప్రముఖ గ్లోబల్ బ్రాండ్‌లు, ఉత్పత్తులతో కొత్త వాక్-త్రూ డ్యూటీ-ఫ్రీ స్పేస్ మునుపెన్నడూ లేని విధంగా ప్రయాణీకుల అనుభవాన్ని మరింత పెంచుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com