యూఏఈ నివాసితులు రెసిడెన్సీ వీసా రద్దు కాకుండా 11 మినహాయింపులు
- December 09, 2022
యూఏఈ: ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ (ICP) రెసిడెన్సీ వీసాను రద్దు చేయకుండా 6 నెలల కంటే ఎక్కువ కాలం పాటు యూఏఈ వెలుపల నివసించడానికి మినహాయింపుల జాబితాను అప్‌డేట్ చేసింది. ఇప్పటికే ఉన్న 6 మినహాయింపులకు అదనంగా మరో 5 కొత్త మినహాయింపులను జోడించింది. దీంతో మొత్తం మినహాయింపుల సంఖ్య 11కి చేరుకున్నది. సాధారణంగా ప్రవాస నివాసి 180 రోజుల కంటే ఎక్కువ కాలం పాటు యూఏఈ వెలుపల ఉంటే, అతని/ఆమె నివాస వీసా ఆటోమెటిక్ గా రద్దవుతుంది. అలా జరిగితే అతను/ఆమె మళ్లీ యూఏఈలోకి ప్రవేశించడానికి కొత్త ప్రవేశ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఒక ప్రవాస నివాసి ఆరు నెలల కంటే ఎక్కువ కాలం పాటు యూఏఈ వెలుపల ఉండడానికి, అదే సమయంలో అతని/ఆమె నివాస వీసా చెల్లుబాటును కొనసాగించడానికి అనుమతించే మినహాయింపులలో ఎమిరాటీ పౌరుడి విదేశీ భార్య, ఎమిరాటీస్‌తో పాటు స్కాలర్‌షిప్ ఉన్న గృహ సహాయకులు ఉన్నారు. విదేశాల్లో చదువుకోవడం, యూఏఈ రోగులతో పాటు వెళ్లే లేదా చికిత్స కోసం విదేశాలకు పంపిన గృహ సహాయకులు యూఏఈలోని వైద్య అధికారులు ఆమోదించిన వైద్య నివేదికను సమర్పించినట్లయితే వారికి మినహాయింపు లభిస్తుంది.
విదేశాలలో యూఏఈకి ప్రాతినిధ్యం వహిస్తున్న దౌత్య, కాన్సులర్ మిషన్‌ల సభ్యులతో పాటు గృహ సహాయకులు, యూఏఈలో నివాస వీసాలు కలిగి ఉన్న అటువంటి మిషన్‌ల ఉద్యోగులకు, శిక్షణ లేదా స్పెషలిస్ట్ కోర్సులకు హాజరు కావడానికి వారి యజమానులు పంపిన ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రవాస నివాసితులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. విదేశాలలో రాజ కుటుంబీకుల ఇళ్లలో పనిచేస్తున్న పాలక కుటుంబాల సభ్యుల గృహ సహాయకులు, విదేశాలలో విద్యాసంస్థలలో చేరిన విద్యార్థులు, పెట్టుబడిదారులు, యూఏఈ దౌత్య, కాన్సులర్ ప్రతినిధులచే స్పాన్సర్ చేయబడిన నివాసితులు, వారిపై ఆధారపడినవారు ఆరు నెలల పాటు యూఏఈ వెలుపల ఉన్నా వారి అతని/ఆమె నివాస వీసా చెల్లుబాటు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







