భర్త సినిమాలో దీపికా ఐటెం సాంగ్.! పర్ఫామెన్స్తో కేక పుట్టించిన రియల్ పెయిర్.!
- December 09, 2022
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, అందాల భామ దీపికా పదుకొనె వైఫ్ అండ్ హజ్బెండ్ అన్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ సినిమాలతో బిజీ బిజీగా కెరీర్లో దూసుకెళ్తున్నారు.
ఎవరి పంథాలో వాళ్లు సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. పెళ్లి తర్వాత దీపిక, ఎక్స్పోజింగ్ ఎక్కువయ్యిందంటూ ఈ మధ్య విమర్శలు ఎదుర్కొంటున్నా వాటిని చాకచక్యంగా తిప్పి కొడుతూ తనదైన శైలిలో కెరీర్‌ని బిల్డప్ చేసుకుంటోంది దీపికా పదుకొనె.
కాగా, లేటెస్టుగా దీపికా, తన భర్త నటిస్తున్న ‘సిర్కస్’ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ గురించి ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. ఇతర హీరోలతోనే దీపిక రొమాంటిక్ సన్నివేశాల్లో పెచ్చిపోతుంటే, రియల్ హజ్బెండ్‌తో వేరే లెవల్ రొమాన్స్ చేసి వుంటుంది ఆన్ స్ర్కీన్ అని ఊహించారంతా.
అయితే, తాజాగా రిలీజ్ చేసిన ఈ సాంగ్‌లో ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు లేవు సరికదా.. రణ్వీర్, దీపికా తమ స్టెప్పులతో ఇరగదీశారు. చూసేందుకు పాట కన్నుల పండుగలా అనిపించింది. కాస్త డిజప్పాయింట్ చేసినా, ఓ మంచి ఐటెం సాంగ్‌లో దీపికా నటించిందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఐటెం సాంగ్ అంటే కేవలం అందాల ఆరబోతే కాదు, ఇలా కేక పుట్టించే పర్ఫామెన్స్తోనూ కట్టి పడేయొచ్చు.. అని దీపిక నిరూపించిందంటూ ఆమెపై ప్రశంసలు గుప్పిస్తున్నారు సినీ అభిమానులు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







