బహ్రెయిన్, చైనా దీర్ఘకాల సహకారం బలోపేతం
- December 10, 2022
మనామా: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా.., క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సమక్షంలో సమావేశమయ్యారు. రియాద్‌లో గల్ఫ్-చైనా సమ్మిట్‌లో హెచ్‌ఎం కింగ్ హమద్ పాల్గొన్న సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బహ్రెయిన్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడులు, అనేక రంగాలలో సహకారాన్ని అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను సమీక్షించారు. ఇరువురు నేతలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, భాగస్వామ్య ఆసక్తికి సంబంధించిన పరిణామాలపై కూడా చర్చించారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో సన్నిహిత సంబంధాలు, వివిధ రంగాలలో సహకారం కోరుకుంటున్నట్లు హిస్ మెజెస్టి ది కింగ్ స్పష్టం చేశారు. బహ్రెయిన్-చైనా సంబంధాలను బలోపేతం చేసేందుకు చైనా ప్రెసిడెంట్ జీ జిన్‌పింగ్ చూపిన ఆసక్తికి హెచ్‌ఎం కింగ్ హమద్ కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.
రాజ్యంలో చైనీస్ కమ్యూనిటీ పాత్రను కొనియాడారు. బహ్రెయిన్‌లో ఆర్థిక, వాణిజ్య అభివృద్ధిని ప్రోత్సహించడంలో వారి ప్రశంసనీయమైన సహకారాన్ని HM కింగ్ హమద్ ప్రశంసించారు. గల్ఫ్-చైనా సమ్మిట్, అరబ్-చైనా సమ్మిట్ ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కోసం మధ్యప్రాచ్యం, చైనా మధ్య దీర్ఘకాలిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఇరువురు తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







