చైనాతో సహకార స్థాయిని పెంచుకుంటాం..అరబ్-చైనీస్ సమ్మిట్‌లో క్రౌన్ ప్రిన్స్
- December 10, 2022
రియాద్: అరబ్ దేశాలు చైనాతో సహకార స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, తమ భాగస్వామ్యంలో కొత్త దశ కోసం ఎదురుచూస్తున్నాయని సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. శుక్రవారం రియాద్‌లో జరిగిన అరబ్-చైనీస్ సమ్మిట్ ఫర్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్లో తన ప్రారంభ ప్రసంగంలో క్రౌన్ ప్రిన్స్ అరబ్ దేశాలు, చైనా మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అరబ్ నాయకులు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హాజరైన శిఖరాగ్ర సమావేశంలో క్రౌన్ ప్రిన్స్ ప్రసంగిస్తూ.. అరబ్-చైనీస్ సంబంధాలు పరస్పర గౌరవం, సహకారంపై ఆధారపడి ఉన్నాయన్నారు. ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వం కోసం సహకారాన్ని పెంపొందించడానికి సౌదీ కృషి చేస్తోందన్నారు. అరబ్-చైనీస్ శిఖరాగ్ర సమావేశానికి ముందు క్రౌన్ ప్రిన్స్ చైనీస్-గల్ఫ్ శిఖరాగ్ర సమావేశంలో చైనా-గల్ఫ్ సహకారంలో కొత్త చారిత్రక దశకు పునాది వేస్తుందన్నారు.
అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం సౌదీ అరేబియా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యారు. జి జిన్‌పింగ్, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో గురువారం జరిగిన సౌదీ-చైనా సమ్మిట్‌కు రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షత వహించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







