చైనాతో సహకార స్థాయిని పెంచుకుంటాం..అరబ్-చైనీస్ సమ్మిట్‌లో క్రౌన్ ప్రిన్స్

- December 10, 2022 , by Maagulf
చైనాతో సహకార స్థాయిని పెంచుకుంటాం..అరబ్-చైనీస్ సమ్మిట్‌లో క్రౌన్ ప్రిన్స్

రియాద్: అరబ్ దేశాలు చైనాతో సహకార స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, తమ భాగస్వామ్యంలో కొత్త దశ కోసం ఎదురుచూస్తున్నాయని సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. శుక్రవారం రియాద్‌లో జరిగిన అరబ్-చైనీస్ సమ్మిట్ ఫర్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్‌లో తన ప్రారంభ ప్రసంగంలో క్రౌన్ ప్రిన్స్ అరబ్ దేశాలు, చైనా మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అరబ్ నాయకులు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ హాజరైన శిఖరాగ్ర సమావేశంలో క్రౌన్ ప్రిన్స్ ప్రసంగిస్తూ..  అరబ్-చైనీస్ సంబంధాలు పరస్పర గౌరవం, సహకారంపై ఆధారపడి ఉన్నాయన్నారు. ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వం కోసం సహకారాన్ని పెంపొందించడానికి సౌదీ కృషి చేస్తోందన్నారు. అరబ్-చైనీస్ శిఖరాగ్ర సమావేశానికి ముందు క్రౌన్ ప్రిన్స్ చైనీస్-గల్ఫ్ శిఖరాగ్ర సమావేశంలో చైనా-గల్ఫ్ సహకారంలో కొత్త చారిత్రక దశకు పునాది వేస్తుందన్నారు.

అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం సౌదీ అరేబియా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యారు. జి జిన్‌పింగ్, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో గురువారం జరిగిన సౌదీ-చైనా సమ్మిట్‌కు రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షత వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com