ఫిఫా ప్రపంచకప్: మెట్రో ఆపరేటింగ్ వేళలు పొడిగింపు
- December 10, 2022
దుబాయ్: ఫిఫా వరల్డ్ కప్ కోసం సవరించిన మెట్రో సమయాలను దుబాయ్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. సమయాల్లో మార్పు డిసెంబర్ 9 నుండి అమలులోకి వచ్చిందన్నారు. ఇది ఖతార్‌లో ఫిఫా ప్రపంచకప్ ఈవెంట్ ముగిసేవరకు పొడిగింపు వేళలు అమల్లో ఉంటాయి. చివరి మెట్రో 1.5 గంటల సర్వీస్ పొడిగింపుతో, చివరి గేమ్ ముగిసిన 45 నిమిషాల తర్వాత బయలుదేరుతుందని తెలిపింది.
ఖతార్‌లో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ సందర్భంగా గంటకు 1,200 మంది ప్రయాణికుల కోసం దాదాపు 1,400 రోజువారీ మెట్రో ట్రిప్పులు, 700 అదనపు టాక్సీలు, 60 ప్రత్యేక పబ్లిక్ బస్సులు, మూడు సముద్ర రవాణా మార్గాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు అథారిటీ వెల్లడించింది.
పొడిగించిన సమయాల జాబితా
డిసెంబర్ 9, డిసెంబర్ 10 ఉదయం 5 నుండి 2.30 వరకు
డిసెంబర్ 13, డిసెంబర్ 14 ఉదయం 5 నుండి 2.30 వరకు
డిసెంబర్ 17 ఉదయం 5 నుండి ఉదయం 1 వరకు
డిసెంబర్ 18 ఉదయం 8 నుండి ఉదయం 1 వరకు
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?
- భారత్‌లో టీసీఎస్‌తో జత కట్టిన OpenAI
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం









