బహ్రెయిన్‌లో దోమల నియంత్రణకు ప్రత్యేక బృందాలు
- December 10, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో కీటకాలు,దోమల వ్యాప్తిని అరికట్టడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీని కోసం 24 మంది ఉద్యోగులు, 16 వాహనాలతో కూడిన ప్రత్యేక బృందం అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మలేరియా, కీటకాల నియంత్రణ గ్రూప్, రోడెంట్ కంట్రోల్ గ్రూప్ ప్రజారోగ్యానికి భరోసా ఇవ్వడానికి ప్రత్యేకించి సంతానోత్పత్తి సీజన్లలో అవగాహన క్యాంపెయిన్ లను నిర్వహిస్తుందన్నారు. పౌరులు, నివాసితులందరికీ దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారాలను చేపట్టామన్నారు. వివిధ ప్రాంతాలు, గవర్నరేట్లలో పురుగుమందులను పిచికారీ చేయడానికి, అలాగే పరిస్థితిని అంచనా వేయడానికి ప్రచారాలు కొనసాగుతున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తప్పుడు వార్తలను నమ్మవద్దని, సందేహాలుంటే నేరుగా హాట్‌లైన్ నంబర్ 66701633 ద్వారా సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. ముహర్రాక్, సదరన్, నార్తర్న్ గవర్నరేట్లలో డ్రైన్లు, రాళ్లను పబ్లిక్ స్క్వేర్ల నుండి శుభ్రం చేయడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొంది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల గురించి మంత్రిత్వ శాఖకు హాట్‌లైన్ నంబర్ 80008188 ద్వారా తెలియజేయాలని కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







