బంగ్లాదేశ్ పై టీమిండియా ఘన విజయం
- December 10, 2022
ఢాకా: బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్ జహుర్ అహ్మద్ చౌధురి స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ పై భారత్ 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచుల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నేటి మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా బంగ్లాదేశ్ ముందు భారత్ 410 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే
బంగ్లాదేశ్ ఏ దశంలోనూ రాణించలేకపోయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లో షకీబ్ (43) మినహా మిగతా ఏ ఆటగాడూ చెప్పుకోదగ్గ రీతిలో బ్యాటింగ్ లో రాణించలేదు. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లో అనముల్ 8, లిట్టన్ దాస్ 29, షకీబ్ 43, రహీం 7, యాసిర్ అలీ 25, ముహ్ముదుల్లా 20, అఫిఫ్ 8, మెహెదీ హసన్ 3, టాస్కిన్ అహ్మద్ 17, ఎదాబత్ 0, ముస్తాఫిజర్ రెహ్మాన్ 13 పరుగులు చేశారు.
దీంతో 34 ఓవర్లకు బంగ్లాదేశ్ 182 పరుగులు మాత్రమే సాధించింది. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ రెండేసి వికెట్లు, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఈ మ్యాచులో భారత బ్యాట్స్‌మెన్‌లో శిఖర్ ధావన్ 3, ఇషాంత్ కిషన్ 210 (131 బంతుల్లో 10 సిక్సులు, 24 ఫోర్ల సాయంతో), విరాట్ కోహ్లీ 113 (90 బంతుల్లో 2 సిక్సులు, 11 ఫోర్ల సాయంతో) పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 3, కేఎల్ రాహుల్ 8, వాషింగ్టన్ సుందర్ 37, అక్షర్ పటేల్ 20, శార్దూల్ ఠాకూర్ 3, కుల్దీప్ యాదవ్ 3 (నాటౌట్) , మొహమ్మద్ సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు.
టీమిండియా స్కోరు 50 ఓవర్లకు 409/8గా నమోదైంది. బంగ్లా బౌలర్లలో షకీబ్ హసన్, ఎదాబత్, టస్కిన్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా, మెహిదీ హసన్, ముస్తాఫఇజుర్ రెహ్మాన్ చెరో వికెట్ తీశారు. కాగా, భారత్-బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..







