పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ చేంజ్..
- December 11, 2022
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కి భవదీయుడు భవత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. కానీ ఇప్పుడు భవదీయుడు ప్లేస్ లో ఉస్తాద్ అని పెట్టారు. ఉస్తాద్ భవత్ సింగ్ గా ప్రకటించారు. అంతే కాదు మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఉపశీర్షికను పెట్టారు. ఈసారి వినోదానికి మించినదంటూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఒక చేతిలో హార్లీ డేవిడ్సన్ బైక్‌ను.. మరోచేతిలో టీ గ్లాస్ పట్టుకుని.. పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. బ్యాక్‌గ్రౌండ్‌లో విద్యుత్ వైర్లు, కరెంట్ తయారు చేసే పరిశ్రమలు కనిపిస్తున్నాయి. ఆకాశంలో మెరుపుల మధ్య టైటిల్‌ను పెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. ఇది పూర్తి కాగానే హరీష్ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా , మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు . ఆదివారం ఉదయం నిద్రవేవగానే పవన్ ఫ్యాన్స్‌కు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ టైటిల్ పోస్టర్ కనిపించడంతో సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఒక్కసారిగా పవన్ లుక్‌ను చూసి తెగ సంబరపడిపోతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!







