లిక్కర్ స్కాంలో కవిత నివాసంలో కొనసాగుతున్న విచారణ..
- December 11, 2022
హైదరాబాద్: భారత రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ కవిత ఇంట్లోనే సీబీఐ DIG రాఘవేంద్ర ఆధ్వర్యంలో కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు అధికారులు. మొత్తం రెండు వాహనాల్లో 6 మంది సీబీఐ అధికారులు కవిత ఇంటికి వచ్చారు. ఈ బృందంలో ఒక మహిళా సీబీఐ అధికారి కూడా ఉన్నారు. తెలంగాణలోనూ ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నిస్తోంది. విచారణలో సీబీఐ అధికారులు కవితకు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ అడిగే ప్రశ్నలకు ఆమె ఏం వివరణ ఇవ్వబోతుందనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది పొలిటికల్ గా మారింది.
అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చడం, ఆ తర్వాత సీబీఐ సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేయడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెంచేసింది. ఐతే సీబీఐ నోటీసులివ్వడంతో కవిత కూడా ఘాటుగా స్పందించారు. అరెస్ట్ చేయకున్నా భయపడేది లేదన్నారు.
ఈ నెల 2 నుంచి 5వ తేదీ వరకు వరుసగా 3 రోజులపాటు కవిత BRS అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అలాగే న్యాయ నిపుణులతోనూ సంప్రదింపులు జరిపారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీబీఐ అడిగే ప్రశ్నలకు ఆమె ఏం వివరణ ఇవ్వబోతుందనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది పొలిటికల్ గా మారింది.
ఈ కేసులో ఈ నెల 6వ తేదీనే కవిత నుంచి CBI అధికారులు వివరణ తీసుకోవాల్సి ఉంది. కానీ ఆ రోజు వేరే కార్యక్రమాలు ఉండటంతో..అందుబాటులో ఉండలేనంటూ సీబీఐకి లేఖ రాశారామె. ఈ నెల 11,12,14,15 తేదీల్లో అందుబాటులో ఉంటానంటూ లేఖలో పేర్కొన్నారు. కవిత లేఖపై స్పందించిన సీబీఐ 11న వివరణ తీసుకునేందుకు వస్తామని రిప్లై ఇచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







