ప్రేమకథా చిత్రాల దర్శకుడితో శర్వానంద్..

- April 25, 2016 , by Maagulf
ప్రేమకథా చిత్రాల దర్శకుడితో శర్వానంద్..

ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న కరుణాకరన్‌కు ఈమధ్య సరైన హిట్స్ లేవు. చేసిన సినిమాలు బాక్స్‌ఆఫీసువద్ద బోల్తా కొడుతుండడంతో కెరీర్ డీలాపడింది. ప్రేమకథలను బాగా డీల్ చేయగల ఈ దర్శకుడు ఈసారి హ్యాట్రిక్ హీరోను పట్టేసాడు. అతడెవరో కాదు శర్వానంద్. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు కూడా కొలిక్కి వచ్చాయని, కథతోపాటు స్క్రిప్ట్ కూడా ఓకే అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుందట. మరోవైపు శర్వానంద్ 'కుమారి 21ఎఫ్' దర్శకుడు సూర్యప్రతాప్‌తో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమా స్క్రిప్ట్ కూడా రెడీ అవుతోంది. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందే సినిమాను బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తాడని అంటున్నారు. మరి శర్వానంద్ కోసం కరుణాకరన్ ఎలాంటి ప్రేమకథ చెబుతాడో చూడాలి!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com