అరుణాచల్ వద్ద భారత యుద్ధ విమానాలు పెట్రోలింగ్
- December 13, 2022
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ వద్ద డిసెంబర్ 9వ తేదీన చైనా, భారత సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బోర్డర్ వద్ద యుద్ధ విమానాలతో భారత్ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. చైనా ఉల్లంఘనలను అడ్డుకునేందుకు గత కొన్ని రోజుల నుంచి భారత వైమానిక దళాలు పెట్రోలింగ్ చేపడుతున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అరుణాచల్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద జోరుగా పెట్రోలింగ్ జరుగుతున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 9వ తేదీన తవాంగ్ సెక్టార్ వద్ద చైనా బలగాలు ఎల్ఏసీ దాటి భారత భూభాగంలోకి వచ్చినట్లు సమాచారం. అయితే భారతీయ సైనికులు చైనా ఆర్మీని ధీటుగా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇవాళ పార్లమెంట్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు. ఘర్షణ రోజున ఇరు వర్గాల దళాలకు స్వల్ప స్థాయిలో గాయాలైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి రెండు దేశాలకు చెందిన బలగాలు వెనక్కి వెళ్లాయి.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







