రష్మికను ఆడుకోవడంలో నెటిజనం ‘తగ్గేదే లే.!’
- December 13, 2022
నేషనల్ క్రష్ రష్మిక చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్డమ్ సంపాదించింది.దాంతో ఆమెపై అసూయ ఎప్పటికప్పుడే కట్టలు తెంచుకుంటూ వుంటుంది.ఏదో ఒక రకంగా వివాదాలు ఆమె చుట్టూ వైఫైలా తిరుగుతుంటాయ్.
తాజాగా ‘కాంతార’ సినిమా విషయంలో రష్మిక చేసిన వ్యాఖ్యలు ఆమెను వివాదాలకు షురూ చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో ఎంతలా సంజాయిషీ ఇచ్చుకుంటున్నా,రష్మికను ఆ వివాదం వీడడం లేదు.
ఏదో ఒకరకంగా దుష్ప్రచారాలు షురూ అవుతూనే వున్నాయ్. తాజాగా రష్మిక సొంతూరుకు కూడా వెళ్లేలేకపోతోందే పాపం.! అంటూ మరో ప్రచారం తెరపైకి వచ్చింది.
ఈ ప్రచారాన్ని కూడా రష్మిక కొట్టి పాడేసింది.తనకు కన్నడ ఇండస్ట్రీ పై వున్న ప్రేమాభిమానం ఎప్పటికీ పోదనీ, అలాగే, ఆ ఇండస్ట్రీ కూడా తనను వదులుకోదనీ గట్టిగా నొక్కి చెప్పింది.
అయినా ఇలాంటి అసత్య ప్రచారాలు తాను పట్టించుకోననీ, తన పని తాను చేసుకుంటూ పోతాననీ రష్మిక మరో స్టేట్మెంట్ పాస్ చేసింది. ప్రస్తుతం రష్మిక ‘వారసుడు’ సినిమా ప్రమోషన్లలో బిజీగా వుంది. అలాగే, రష్మిక బాలీవుడ్ చిత్రం ‘మిషన్ మజ్ను’ జనవరిలో ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా వుంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







