గుడ్ న్యూస్: మెగా ఇంట సంతోషాల పండగంట.!
- December 13, 2022
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తాత కాబోతున్నారు. అహో.! మెగా ఇంటికి వారసుడొస్తున్నాడోచ్.! అర్ధమైపోయి వుంటుంది కదా.
అవునండీ, రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లితండ్రులు కాబోతున్నారు. మా కులదైవం హనుమాన్ జీ ఆశీస్సులతో రామ్ చరణ్, ఉపాసన పేరెంట్స్ కాబోతున్నారు.. అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆనందంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
ఇంకేముంది.. ఈ పోస్ట్ కొన్ని క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మెగా ఇంట సంతోషం నిండింది. మెగా ఫ్యాన్స్‌కీ ఇది గుడ్ న్యూసే.
పెళ్లయ్యి పదేళ్లయినా ఇంకా రామ్ చరణ్ తండ్రి కాలేకపోయాడంటూ అప్పుడప్పుడూ విమర్శలు వినిపిస్తుంటాయ్. ఆ విమర్శలకు చెక్ పెడుతూ, మెగా ప్యాన్స్‌కి ఆ లోటు తీర్చేయనున్నాడు రామ్ చరణ్.
రామ్ చరణ్ ప్రస్తుతం తన 15వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







