టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి నెల రోజులు జైలు శిక్ష
- December 13, 2022
తిరుమల: టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు నెల రోజులు జైలుశిక్ష విధించింది. ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్ రెగులరైజ్ చేయాలని ధర్మారెడ్డిని గతంలో న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు అమలు కాలేదు. దీంతో ధర్మారెడ్డి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన న్యాయస్థానం ధర్మారెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే మరో వారం జైలుశిక్ష పొడిగించాలని ఆదేశించింది.
కోర్టు ఉత్తర్వులు అమలు చెయ్యలేదని టీటీడీ ఈవోకు జైలు శిక్ష విధించడం హాట్ టాపిక్ గా మారింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఈ తీర్పు వెలువరిస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
గతంలో టీటీడీలో పని చేస్తున్న ముగ్గురు తాత్కాలిక సిబ్బంది క్రమబద్దీకరణ కోసం కోర్టును ఆశ్రయించారు. ఆ ముగ్గురినీ క్రమబద్దీకరించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, కోర్టు ఆదేశాలు అమలు చేయలేదు. దీంతో ఉద్యోగులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు.. ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







