450 కంటే ఎక్కువ వాణిజ్య కేసులు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్

- December 14, 2022 , by Maagulf
450 కంటే ఎక్కువ వాణిజ్య కేసులు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్

రియాద్: 2022లో 450కి పైగా కమర్షియల్ కన్సీల్‌మెంట్ (తస్తాతూర్) కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్‌రహ్మాన్ అల్-హుస్సేన్ వెల్లడించారు. 2022లో సౌదీ అరేబియాలోని అన్ని ప్రాంతాల్లోని పర్యావరణ నౌకాశ్రయాలకు 127,000 పార్టిసిపేటరీ మానిటరింగ్ టూర్‌లు నిర్వహించబడ్డాయన్నారు. యాంటీ-కమర్షియల్ కన్సీల్‌మెంట్ చట్టం ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకోవడానికి కమిటీ జారీ చేసిన 646 ఉల్లంఘనలు ఉన్నాయని, ఉల్లంఘించిన వారిపై విధించిన ఆర్థిక జరిమానాలు SR14 మిలియన్లకు మించి ఉన్నాయని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా వాణిజ్య ఉల్లంఘనలను అనుసరించే విధానాన్ని అల్-హుస్సేన్  వివరించారు. గతంలో పరిశీలకుడు నేరుగా సంస్థలను సందర్శించి, వారి పత్రాలు, ఆర్థిక లావాదేవీలను తనిఖీ చేసేవారన్నారు. అయితే, ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లో వాణిజ్య సంస్థల సమాచారం అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com