Ciscoలో 4,000 మంది ఉద్యోగులు తొలగింపు
- December 14, 2022
ప్రపంచ వ్యాప్తంగా బడా బడా సంస్థలన్నీ ఉద్యోగుల్ని వదిలించుకుంటున్నాయి. ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగుల కోత పెడుతున్నాయి. ఖర్చు తగ్గించుకోవటానికి వేలాదిమంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. వీరి బాటలోనే మరో సంస్థ కూడా అడుగులు వేస్తోంది. అదే ‘సిస్కో’(Cisco).
ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులను వదిలించుకునే పనిలో పడ్డాయి బడా కంపెనీలైన అమెజాన్, ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్, లెనోవో, అడోబ్, సేల్స్ ఫోర్స్ వంటి దిగ్గజ సంస్థలు. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులకు చివరి జీతం ఇచ్చి ఇంటికి పంపించేశాయి. దీంతో ఉద్యోగులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ఉద్యోగుల కోతలు పెద్ద స్థాయి నుంచి పలు విభాగాలకు చెందినవారు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది టెక్ రంగంలో ఉద్యోగాలు కోల్పోయారని అంచనాలు చెబుతున్నాయి.
ఈక్రమంలోనే అమెరికా టెక్ దిగ్గజం సిస్కో కూడా ఇదే బాటలో నడుస్తోంది. 4 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. నవంబర్ నెలలోనే సిస్కో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగించనుంది. ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ కావటంతో వేరే దారిలేక ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులను సమతుల్యం చేసుకోవటానికి సిస్కో ఈ నిర్ణయం తీసుకుందని ఓ బిజినెస్ మ్యాగజైన్ పేర్కొంది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







