‘అవతార్ 2’ చిత్రానికి శ్రీనివాస్ ‘అవసరం’ పడిందా.?
- December 14, 2022
‘అష్టా చెమ్మా’ సినిమాతో నటుడిగా పరిచయమైన శ్రీనివాస్ అవసరాల ఆ తర్వాత ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తనదైన రచనా టాలెంట్‌నీ బయట పెట్టుకున్నాడు.
తెలుగు నాట, నటుడిగా, దర్శకుడిగా, డైలాగ్ రైటర్‌గా తనదైన ముద్ర వేసుకున్న శ్రీనివాస్ అవరసరాల తాజాగా ఓ గోల్డెన్ ఛాన్స్ దక్కంచుకోవడం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతున్న ‘అవతార్ 2’ సినిమా తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసే ఛాన్స్ శ్రీనివాస్ అవసరాలను వరించింది. ప్రపంచ వ్యాప్తంగా 60 భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.
ముఖ్యంగా తెలుగులో 100 కోట్ల టార్గెట్ దిశగా ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఆయా భాషల నుంచి పలువురు డైలాగ్ రైటర్స్ ఎంపిక కాగా, తెలుగు నుంచి శ్రీనివాస్ అవసరాల సెలెక్ట్ అయ్యారు.
‘అవతార్ 2 - ది వే ఆఫ్ వాటర్’ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌కి శ్రీనివాస్ అవసరాల వంటి తెలుగు వ్యక్తికి ఛాన్స్ దొరకడం టాలీవుడ్ చేసుకున్న అదృష్టంగానే భావించాలి. అవసరాల ఈ అతిపెద్ద బాధ్యతను తన టాలెంట్‌తో ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి మరి.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







