చైతూ వెబ్ సిరీస్ అప్‌డేట్ వచ్చిందహో.!
- December 14, 2022
స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా సినిమాలతో పాటూ, డిజిటల్ రంగంలోనూ నటీ నటులు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కినేని బుల్లోడు నాగ చైతన్య ‘దూత’ అనే ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు.
ఎప్పుడో అనౌన్స్‌మెంట్‌కి వచ్చిన ఈ సిరీస్ గురించి ఇంతవరకూ ఎలాంటి అప్‌డేట్ రాలేదు. చైతూతో ‘మనం’ సినిమా తెరకెక్కించిన విక్రమ్ కుమార్ ఈ సిరీస్‌ని రూపొందిస్తున్నాడు. డిజిటల్ వరల్డ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ వెబ్ సిరీస్‌ని సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిస్తున్నారు.
తమిళ, మలయాళ పరిశ్రమల నుంచీ ప్రముఖ నటీనటులు ఈ సిరీస్‌లో వివిధ పాత్రలు పోషిస్తుండగా, తమిళ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా, చైతూ ఈ సిరీస్‌లో జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడంటూ ఓ లీక్ బయటికి వచ్చింది.
సినిమాల్లో ఇంతవరకూ చైతూ పోషించని ఇంటెన్స్ రోల్‌గా ఈ రోల్ గురించి గొప్పగా చెబుతున్నారు. ఓటీటీ వేదికగా ఈ సిరీస్ చైతూకి మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతూ ‘కస్టడీ’ అను యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కృతి శెట్టి ఈ సినమాలో చైతూకి జోడీగా నటిస్తోంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







